రానున్న 14, 15, 16వ తేదీలలో మూడు రోజులు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తం చేయాలని శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాలలో సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను తెలుసుకోని ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.