పెనుకొండ మండలం చంద్రగిరి గ్రామంలో వెలసిన శ్రీగిరి మహేశ్వరి శక్తిపీఠంలో గురువారం ద్వితీయ సంవత్సరం దేవి శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. గురువారం మహేశ్వరి అమ్మవారిని బాల త్రిపుర సుందరి దేవి అలంకరణలో అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. నేటి నుంచి 9 రోజుల పాటు మహేశ్వరి అమ్మవారిని వివిధ అలంకరణలతో అలంకరించి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని శ్రీగిరి శక్తి పీఠాధిపతి దేవేంద్ర స్వామి తెలిపారు.