మడకశిర మండలం హెచ్ ఆర్ పాళ్యం గ్రామంలో నిరుపేద కుటుంబం బాత్రూంలో ఏడు సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నారన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజు బుధవారం వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ఇంటి నిర్మాణం మొదలు పెట్టారు. ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ చేసిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి, మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ, హౌసింగ్ డిఈ తదితరులు పాల్గొన్నారు.