దసరా పండుగ సందర్భంగా శనివారం కళ్యాణదుర్గం పట్టణంలోని ఎర్రనేల వీధిలో వెలసిన జమ్మి వృక్షానికి ఉదయం నుంచి భక్తులు పూజలు నిర్వహించారు. సాయంత్రం పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామానికి కూడా భక్తులు అధిక సంఖ్యలో జమ్మి వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జమ్మి ఆకును పెద్దలకు ఇచ్చి కాళ్లకు నమస్కరించుకొని వారి భక్తి ప్రభక్తులను చాటుకున్నారు.