కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు ఆదేశాలు మేరకు నియోజకవర్గంలో
టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శనివారం నాయకులు ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మసముద్రం మండలం తెలుగు యువత నీలస్వామి ఆధ్వర్యంలో గుండిగానిపల్లిలో సభ్యత్వ నమోదును ఏర్పాటుచేశారు. కార్యకర్తలందరూ రూ. 100లతో సభ్యత్వం తీసుకుని రూ. 5లక్షల బీమాను పొందాలని సూచించారు. కార్యకర్తల సంక్షేమమే చంద్రబాబు ఆకాంక్ష అని నాయకులు తెలిపారు.