ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మొదటి విడతగా రెండు లక్షల రూపాయలు విరాళం అందించారు. భైరవాణి తిప్ప ప్రాజెక్ట్ కింద ఉన్న సవరమ్మ దేవాలయ పున ప్రారంభానికి ఎమ్మెల్యే సురేంద్రబాబు ఐదు లక్షల విరాళం ప్రకటించారు. అందులో భాగంగానే తొలుత రెండు లక్షల విరాళాన్ని స్థానిక నాయకులకు అందజేశారు. అనంతరం ఆలయంలోని అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.