కదిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి సంబంధించిన గోమాతలు వీధులలలో తిరుగుతూ ప్రమాదాలకు గురవుతున్నాయి. వందల గోమాతల ఉన్నా కొన్ని రోజులుగా తగ్గిపోతున్నాయని పట్టణ ప్రజలు తెలిపారు. కొన్ని గోమాతలు ఉన్నట్టుండి కింద పడిపోతున్నాయని హిందూ సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. వాహన ప్రమాదాలలో గోమాతలు చనిపోతున్నాయన్నారు. దేవాదాయ శాఖ అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.