చట్టసభలో బీసీలకు 33% రిజర్వేషన్ అమలు చేయడం హర్షనీయమని శ్రీ సత్య సాయి జిల్లా టిడిపి అధ్యక్షుడు వడ్డే అంజనప్ప హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ నిర్ణయం తీసుకోవడం పై బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేయడం బీసీలందరికీ శుభపరిణామం అన్నారు.