గుంతకల్లులోని న్యూ డెమోక్రసీ ఎంఎల్ పార్టీ కార్యాలయంలో ఆదివారం పీడిత ప్రజల ఉద్యమకారుడు ప్రొఫెసర్ సాయిబాబా సంస్మరణ సభను నిర్వహించారు. ముందుగా ప్రొఫెసర్ సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం అమరహే ప్రొఫెసర్ సాయిబాబా అంటూ నినాదాలు చేశారు. ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ ఆదివాసులపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న యుద్ధాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారన్నారు.