గుంతకల్లు మండలం పాత కొత్తచెరువు హైస్కూల్ లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ.. బుధవారం ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పాఠశాల ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి వెంకీ మాట్లాడుతూ.. పాఠశాలలో విద్యార్థులకు మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే హై స్కూల్ ఇంఛార్జ్ హెచ్ఎంని సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. హెచ్ఎం కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.