సాగునీటి సాధనకై కరువు నుంచి జిల్లాను కాపాడుకుందాం అనే నినాదంతో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న బస్సు యాత్ర గురువారం పామిడి పట్టణానికి చేరింది. సీపీఎం జిల్లా నాయకురాలు నిర్మలమ్మ మాట్లాడుతూ హెచ్. ఎల్. సికి ఆధునీకరణ పనులు వెంటనే చేపట్టాలన్నారు. హంద్రీనీవా ఆయకట్టుకు భూములకు సాగునీరు ఇవ్వాలని, రైతాంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.