విజయవాడ వరద బాధితులకు టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ రూ. 5లక్షల విరాళం ప్రకటించారు. సంబంధిత చెక్కును బుధవారం సీఎం నారా చంద్రబాబు నాయుడుకు అందజేశారు. శ్రీరామ్ ను సీఎం అభినందించారు. పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఈ మొత్తం అందజేసినట్లు శ్రీరామ్ తెలిపారు.