ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఉచిత ఇసుక హామీని తక్షణమే నిలబెట్టుకోవాలని ముదిగుబ్బ మండల కేంద్రంలో సీపీఎం సీఐటీయూ నాయకులు ధర్నా చేశారు. శుక్రవారం ముదిగుబ్బ తహశీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించి ఉచిత ఇసుకను వెంటనే అమలు పరచాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ముదిగుబ్బ మండల సీపీఎం సీఐటీయూ కార్యదర్శులు ఆటో పెద్దన్న, బండల వెంకటేశు కార్యకర్తలు పాల్గొన్నారు.