మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ అమినిటీ సెక్రటరీస్, మున్సిపల్ ఇంజినీర్, హౌసింగ్ ఇంజినీర్స్ తో సమావేశాన్ని గురువారం నిర్వహించారు. కమిషనర్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ. మున్సిపల్ ఉద్యోగులు బాధ్యతతో సేవలను నిర్వర్తించాలని, అప్పుడే పురపాలక సంఘ కార్యాలయమునకు మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. నీటి సరఫరా సమస్యల కోసం ఒక రిజిస్టర్ నిర్వహించాలని, పరిష్కరించని సమస్యలను సంబంధిత ఇంజినీర్స్కి అందించాలని ఆదేశించారు.