ధర్మవరం నియోజకవర్గం, బత్తలపల్లి మండలం, తంబాపురం గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త రమణారెడ్డి తోటలోని 50 చీని చెట్లను గుర్తు తెలియని దుండగులు శుక్రవారం రాత్రి నరికి వేశారు. బాధితులు రమణారెడ్డి మాట్లాడుతూ.. 3 సంవత్సరాల కాలం నుండి తోటలో చీని చెట్లను సాగు చేస్తున్నానన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వేళలో గుర్తుతెలియని దుండగులు 53 చీని చెట్లను నరికి వేయడంతో ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు.