నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష దరఖాస్తులకు నేడు ఆఖరి తేదీ అని డీఈఓ వరలక్ష్మీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి ఈ ఏడాది డిసెంబరు 8న ఈ పరీక్ష ఉంటుందని తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచి, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులకు 9వ తరగతి నుంచి వరుసగా నాలుగేళ్లు ఏడాదికి రూ. 12 వేలు చొప్పున కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.