గత వెసీపీ హయాంలో పాలకులు చేసిన తప్పులు నగర ప్రజలకు శాపాలుగా మారాయని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పేర్కొన్నారు. మీ ఇంటికి-మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా గురువారం అశోక్ నగర్లో ఎమ్మెల్యే పర్యటించారు. స్థానికంగా ఇంటింటికీ వెళ్లి సమస్యలపై ప్రజలతో ఆరా తీశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అశోక్‌నగర్ బ్రిడ్జి ఎత్తులో కట్టాలని గత ప్రభుత్వంలో ప్రతిపాదనలు ఉన్నప్పటికీ రోడ్డుకు సమానంగా కట్టడంతో డ్రైనేజీ సమస్య ఎక్కువైందన్నారు.