మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ రోజున పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ పీ.జగదీశ్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 16వ తేదీ నుంచి రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అమలు కానున్న నేపథ్యంలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తుల స్వీకరణ శుక్రవారంతో ముగిసింది. ఈనెల 14న లాటరీ పద్ధతి ద్వారా దుకాణాల కేటాయింపు ప్రక్రియ జరుగనుంది. ఈ ప్రక్రియ స్థానిక జేఎన్టీయులోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో జరగనుంది.