నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోని తూర్పు రొంపిదొడ్ల గ్రామంలో చెరువు కాలువ పూడికతో వర్షపు నీళ్లు వెళ్లలేని పరిస్థితి ఉండడంతో స్థానిక సర్పంచ్ కూండ్ల నాగేశ్వరి-లక్ష్మీ నరసయ్య ఆధ్వర్యంలో ముందస్తు చర్యలో భాగంగా కాలువ పూడిక తీత పనులు బుధవారం చేపట్టారు. ముందస్తుగా చర్యలు తీసుకోవడం వలన రానున్న రెండు రోజుల్లో ఎంత పెద్ద వర్షం కురిసిన కట్ట తెగిపోకుండా నీళ్లు చెరువుకు వెళ్తాయి.