నెల్లూరు జిల్లా ఉదయగిరి సబ్ డివిజన్ పరిధిలోని రైతు సేవా కేంద్రం వ్యవసాయ సహాయకులకు ఒక్క రోజు సామర్ధ్య పెంపుపై శిక్షణ కార్యక్రమం ఉదయగిరిలోని స్త్రీశక్తి భవన్లో శుక్రవారం జరిగింది. నెల్లూరు వ్యవసాయ శాఖ ఏడిఏ లక్ష్మీమాధవి మాట్లాడుతూ. వేరుశనగ, మినుము, వరి, జొన్న పంటలలో మేలైన రకాలు వాటి పంటకాలం, దిగుబడులను గురించి అవగాహన కల్పించారు. ఎరువులు యాజమాన్య పద్ధతులపై కూడా వివరించారు.