AP: చంద్రబాబు చెప్పినట్లే పోలీసులు వ్యవహరిస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘సోషల్ మీడియా యాక్టివిస్ట్లను అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం, కోర్టులో హాజరుపర్చడం జరుగుతోంది. కేసు నమోదు చేసిన 24 గంటల్లో కోర్టులో హాజరు చేస్తే లీగల్గా యాక్షన్ తీసుకుంటాం. కానీ తప్పుడు కేసులు బనాయించి, వాళ్లను కొట్టి కోర్టులో హాజరు పరుస్తున్నారు. ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను హరించేలా పోలీసులు వ్యవహరిస్తున్నారు.’ అని అన్నారు.