నిత్యం తడబాట్లు, మతిమరుపు కారణంగా హెడ్‌లైన్స్‌లో నిలిచిన అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి అదే కారణంతో వార్తల్లో నిలిచారు. బీచ్‌లో ఇసుక దిబ్బలపై నడిచేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 81 ఏళ్ల బైడెన్ ఫస్ట్ లేడీ జిల్‌తో కలిసి ఆదివారం డెలావేర్‌లోని తన ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ బీచ్‌లో ఇసుకపై నడిచేందుకు బైడెన్ చాలా ఇబ్బంది పడ్డారు.