రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు శుక్రవారం నెల్లూరులో అన్నదాతకు అండగా పేరిట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన. ధర్నా నిర్వహించారు.