ఈనెల 14 నుంచి 20 వరకు జరగనున్న ఇంధన పొదుపు వారోత్సవాలను విజయవంతం చేయాలని విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ వి. విజయన్ కోరారు. శుక్రవారం నెల్లూరు విద్యుత్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే కాలంలో విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇంధన పొదుపు చర్యల ఆవశ్యకతను వారోత్సవాల ద్వారా అవగాహన కల్పించనున్నామన్నారు. పలువురు ఇంజనీర్లు పాల్గొన్నారు.