గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షానికి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని చెరువులు, కుంటలు నిండాయి. దీంతో పంట సాగు చేసే యోచనలో రైతులు ఉన్నారు. ఈ భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో చేతికి వచ్చిన పంట నేలమట్టం అవడంతో తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పలు మండలాలు గ్రామాల్లో భారీ వరదలకు జనజీవన స్తంభించింది. ఆ వరదల నీరు అంతా కాలువలో, చెరువులో చేరింది.