కావలి రూరల్ మండలం అన్నగారి పాలెం పంచాయతీ వైఎస్ఆర్సిపి నాయకులు, మాజీ ఎంపీటీసీ మక్కే భాస్కర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కావలి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బుధవారం వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే తో పాటు పలువురు వైసిపి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.