ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలంలో రెండు ద్విచక్ర వాహనాలు చోరీకి గురైన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన చెందిన ప్రతాప్ రెడ్డి, అల్లు రెడ్డికి చెందిన ద్విచక్ర వాహనాలు అపహరణకు గురయ్యాయి. తమ వాహనాల కోసం అన్వేషించి తర్వాత బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఎస్సై అందుబాటులో లేకపోవడంతో బాధితుల ఫిర్యాదులు పోలీసు సిబ్బంది స్వీకరించటం లేదని బాధితులు తెలిపారు.