కనిగిరి మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు మీద వాహనదారులను వెంబడించిన కుక్కల వల్ల వాహనదారులు రోడ్డు మీద పడిపోయే సంఘటనలు ఎన్నోసార్లు జరిగాయి. మున్సిపల్ అధికారులకు కుక్కల బెడద గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ పరిస్థితి కనిగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఉండి, ఈ కుక్కల బెడదతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.