ఒంగోలు రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం
ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రెవిన్యూ సమస్యలపై వస్తున్న అర్జీలు తగ్గుముఖం పట్టాయని, వచ్చిన ప్రతి అర్జీని సహేతుకంగా, సకాలంలో పరిష్కరించాలని తెలిపారు. మీకోసం మధ్యలో వెంటనే పరిష్కారం అయ్యేలా పర్యవేక్షించాల్సిన బాధ్యత సంబంధిత డివిజన్ సబ్ కలెక్టర్, ఆర్డీవోలకు తెలిపారు.