ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో శనివారం ప్రభుత్వ వైద్యులు వినికిడి లోపం ఉన్న చిన్నారులకు వినికిడి పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా వినికిడి లోపం ఉన్న వారిని గుర్తించి ఉచిత వినికిడి యంత్రాలను అమర్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మెడికల్ హెల్త్ ఆఫీసర్ సురేష్ బాబు, వైద్యులు పాల్గొన్నారు.