ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా స్వయాన ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ శనివారం రాత్రి రంగంలోకి దిగారు. ఒంగోలులోని ఆర్టీసీ సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చేపట్టిన చర్యలను పోలీసులతో కలిసి ఎస్పీ పరిశీలించారు. అనంతరం అధికారులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. ఒంగోలులో రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టినట్లుగా ఎస్పీ తెలిపారు.