ఒంగోలులోని కెనరా బ్యాంకు ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో కెనరా నారీశక్తి పేరుతో డిఆర్డిఏ సౌజన్యంతో కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పొదుపు ఆర్థిక క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన స్వయం సహాయక సంఘాల మహిళలు మరో అడుగు ముందుకేసి లక్షాధికారులుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కలెక్టర్ తెలిపారు.