ఎన్డీఏ కూటమి ప్రభుత్వం హయాంలో కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర అభివృద్ధికి నిధులు తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఒంగోలు కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గౌస్ విమర్శించారు. ఒంగోలులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం మీడియాతో కాంగ్రెస్ పార్టీ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గౌస్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి బదులు డైవర్షన్ రాజకీయాలకు తెరలేపిందని ఎద్దేవ చేశారు.