ఒంగోలులో ఆక్రమణలను తొలగించిన అధికారులు

68பார்த்தது
ఒంగోలు నగరంలో కాలువలపై నిర్మించిన కాంక్రీటును, కల్వర్టులను కార్పొరేషన్ అధికారులు తొలగిస్తున్నారు. ఆదివారం కూడా గుంటూరు రోడ్డు, కర్నూలు రోడ్డులో ఉన్న ఆక్రమణలను అధికారులు జెసిబి సహాయంతో తొలగించారు. గత కొన్ని రోజులుగా ఆక్రమణలపై అధికారులు దృష్టి సారించిన విషయం తెలిసిందే. డ్రైనేజీ కాలవలపై ఆక్రమణలను తొలగింపు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி