ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఈ కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన 90 మంది ఫిర్యాదులను అర్జీల రూపంలో స్వయంగా స్వీకరించారు. వారితో ముఖాముఖి మాట్లాడి త్వరితగతిన తమ సమస్యలను పరిష్కరిస్తామని బాధితులకు భరోసా కల్పించారు.