ఈనెల 14వ తేదీ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరగవలసిన మీకోసం కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లుగా జిల్లా రెవెన్యూ అధికారి ఆర్ శ్రీలత ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. జిల్లాలో మద్యం షాపుల కేటాయింపు కోసం సోమవారం లాటరీ నిర్వహించాల్సి ఉండటంతో జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ ప్రక్రియలో పాల్గొనాల్సి ఉన్నందున, మీకోసం కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లుగా ఆమె వివరించారు.