ఒంగోలు పట్టణంలోని ప్రైవేటు అతిథి గృహంలో జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కాపు వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తిక వనభోజనాలు సామాజిక వర్గాల్లో ఐక్యతను చాటేందుకు దోహదపడతాయన్నారు. కాపుల సమస్యలను పరిష్కరించడానికి తాను ఎప్పుడు ముందుంటానని తెలియజేశారు.