ఈనెల 30వ తేదీన ఎన్డీఏ కూటమి నాయకులతో సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లుగా టిడిపి పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు నూకసాని బాలాజీ ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహించే కార్యాచరణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరవుతున్నారని కూటమి నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.