ఒంగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని బెల్టు షాపులపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా మద్యం అమ్మే వారిపై కేసులు నమోదు చేయటానికి తనిఖీలు నిర్వహించారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తూ అక్రమంగా మద్యం అమ్మేవారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ బెల్టు షాపులను నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని నిర్వాహకులకు హెచ్చరించారు.