ఒంగోలు లోక్సభ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మంగళవారం ఒంగోలులో జరిగే పలు కార్యక్రమాలలో పాల్గొంటున్నట్లుగా ఆదివారం మాగుంట కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఉదయం 10 గంటలకు స్థానిక రామ్ నగర్ లో మాగుంట కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు. 11 గంటలకు కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక హాలులో జరిగే స్వర్ణాంధ్ర- 2047 జిల్లా స్థాయి విజన్ సంప్రదింపులు, సలహాల సమావేశానికి హాజరవుతారన్నారు.