జిల్లాస్థాయి డ్యాన్స్ స్పోర్ట్స్ సెలక్షన్స్

576பார்த்தது
జిల్లాస్థాయి డ్యాన్స్ స్పోర్ట్స్ సెలక్షన్స్
ఒంగోలులోని స్థానిక సివియన్ రీడింగ్ హాల్లో ప్రకాశం జిల్లా డాన్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా స్థాయి డాన్స్ సెలక్షన్స్ నిర్వహించారు. ఈ పోటీలలో జిల్లా నలుమూలల నుండి అభ్యర్థులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ విద్యావంతుల వేదిక కన్వీనర్ ప్రముఖ న్యాయవాది మోహన్ హాజరయ్యారు. విజేతలకు సర్టిఫికెట్స్ అండ్ మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా డాన్స్ స్పోర్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకట్రావు, వైస్ ప్రెసిడెంట్ సాల్మన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ గణేష్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ శివ, ఎగ్జిక్యూటివ్ నెంబర్ హనుమంతరావు పాల్గొని విజేతలను అభినందించారు. ఈ విజేతలు డిసెంబర్ నెలలో తాడేపల్లిగూడెంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో విజయం సాధించాలని విజేతలకు సూచించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி