పొదిలి మండలం మాదిరెడ్డి పాలెం సర్పంచ్ ఓంకార్ ను రమేష్ అనే వ్యక్తి హత్య చేసేందుకు యత్నించాడని సీఐ వెంకటేశ్వర్లు మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఓ భూ వివాదంలో హత్యాయత్నం జరిగినట్లుగా విచారణలో గుర్తించామని వెంకటేశ్వర్లు అన్నారు. ప్రజలు తొందరపడి సరైన పత్రాలు లేకుండా భూములను కొని ఇబ్బందులు తెచ్చుకోవద్దని సీఐ సూచించారు. హత్య చేసేందుకు యత్నించిన నిందితుడి కోసం అన్వేషిస్తున్నామని సిఐ అన్నారు.