పొన్నలూరులో వాలంటీర్లకు వందనం కార్యక్రమం

2911பார்த்தது
పొన్నలూరులో వాలంటీర్లకు వందనం కార్యక్రమం
పొన్నలూరు మండల కేంద్రంలో మండల ఎంపీడీఓ రత్నజ్యోతి ఆధ్వర్యంలో మండలంలోని సచివాలయం వాలంటీర్లకు వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కొండేపి ఇంచార్జ్ వరికూటి అశోక్ బాబు పాల్గొని వాలంటీర్లను సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను అర్హులైన పేదలకు అందిస్తూ, ప్రతి నెలా ఒకటో తేదీ అవ్వాతాతలకు పెన్షన్లు పంపిణీ చేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా నిలుస్తున్న వలంటీర్ల సేవలు అభినందనీయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ కొండబత్తిన మాధవరావు, జడ్పీటీసీ బెజవాడ వెంకటేశ్వర్లు, మండల వైసీపీ కన్వీనర్ పల్నాటి వెంకటేశ్వర రెడ్డి, సచివాలయ జేసిఎస్ కన్వీనర్ పిల్లి తిరుపతి రెడ్డి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி