పొన్నలూరు మండలంలోని కోటపాడు గ్రామ సచివాలయ పరిధిలో గల కోటపాడు గ్రామంలో సచివాలయ కన్వీనర్ నాగిరెడ్డి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జగన్ననే మా భవిష్యత్ జగన్ననే మా నమ్మకం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు జగనన్న పాలనలో అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించి పాలనపై అభిప్రాయాలు తీసుకుని జగనన్నే మా నమ్మకం అనే టోల్ ఫ్రీ నంబర్ కు ప్రజలతో కాల్ చేయించి కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గృహసారాదులు యానమలమంద వెంకటేశ్వర్లు, అన్నెం ఆదిలక్ష్మి గ్రామ వైసీపీ నాయకులు నారపరెడ్డి మహేశ్వర్ రెడ్డి ఫీల్డ్ అసిస్టెంట్ అన్నెం వెంకట నారాయణ, అన్నెం మాధవరెడ్డి, కొచర్ల బ్రహ్మయ్య పాల్గొన్నారు.