పొన్నలూరు మండలం మాలపాడు గ్రామంలో కస్తూరి గాంధీ బాలికల విద్యాలయంలో 2023-24 విద్యసంవత్సరానికి సంబంధించిన 6, 7, 8 తరగతుల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సుభాషిణి తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మార్చి 27 నుండి ఏప్రిల్ 20 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. పూర్తి వివరాలకు 9010638151 నెంబర్ ను సంప్రదించాలని ఆమె కోరారు.