పొన్నలూరు మండలం చెన్నిపాడు గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నాడు ప్రధాన ఉపాధ్యాయులు వేణుగోపాల్ ఆధ్వర్యంలో పాఠశాల ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జడ్పిటిసి సభ్యులు బెజవాడ వెంకటేశ్వర్లు, ఎంపీపీ కొండాబత్తిమాధవ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ కలిగి కష్టపడి చదవాలని వారు అన్నారు.
గత సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో ప్రధమ స్థానం సాధించిన వెదురు భార్గవి అనే విద్యార్థికి విప్పగుంట జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు 5000 వేల రూపాయల నగదును ప్రోత్సాహకంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శారామ్మ భాస్కర్, విద్యా కమిటీ చైర్మన్ రమేష్ రెడ్డి, పాఠశాల సిబ్బంది ,విద్యార్థులు పాల్గొన్నారు.