పొన్నలూరులో మంచినీటి చలివేంద్రం ఏర్పాటు

901பார்த்தது
పొన్నలూరులో మంచినీటి చలివేంద్రం ఏర్పాటు
పొన్నలూరులో గుడిపూడి కిరణ్ ఆధ్వర్యంలో బుధవారం మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఎస్పై దాసరి రాజారావు చేతుల మీదగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పై మాట్లాడుతూ ఈ ఏడాది ఎండలు విపరీతంగా ఉన్నందున బాటసారులు, పాదచారుల సౌకర్యార్థం సీయస్సీ ఇంటర్నేట్ అధినేత కిరణ్ తన సొంత నిధులతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

ప్రభుత్వ కార్యాలయాల దగ్గరకు పని మీద మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు వచ్చిపోతుంటారని, వారు మంచినీటికి ఇబ్బందులు పడకుండా చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త, విశ్లేషకులు నూతలపాటి శివనారాయణ, చుండి నవీన్, జడ భరత్ కుమార్ పాల్గొన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி