రేషన్ బియ్యం అక్రమాలపై నిఘా ఏర్పాటు చేసినట్లుగా కనిగిరి ఆర్డిఓ కేశవర్థన్ రెడ్డి తెలిపారు. ఆర్డీవో కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కనిగిరి రెవెన్యూ డివిజన్ లో రేషన్ పంపిణీ అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఇందులో భాగంగా అక్రమంగా రేషన్ తరలిస్తున్న వారిపై విజిలెన్స్ నిఘా ఉంచామన్నారు. రేషన్ బియ్యం తరలిస్తూ పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.