కనిగిరి మున్సిపాలిటీని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫూర్ తెలిపారు. కనిగిరిలోని 8వ వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను, డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులను మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫూర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పనులను పరిశీలించిన అనంతరం పనుల నాణ్యతతో జరిగేలా చూడాలని మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులను ఆయన ఆదేశించారు.