కనిగిరి: విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించాలి

69பார்த்தது
కనిగిరి: విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించాలి
విద్యుత్ వినియోగదారులు సకాలంలో విద్యుత్ బిల్లులను చెల్లించి విద్యుత్ శాఖకు సహకరించాలని కనిగిరి డివిజన్ విద్యుత్ శాఖ ఈఈ వీరయ్య కోరారు. కనిగిరి లోని విద్యుత్ శాఖ కార్యాలయంలో వీరయ్య గురువారం మాట్లాడుతూ విద్యుత్ బకాయిలు కోట్ల రూపాయలలో పేరుకుపోయాయన్నారు. దీంతో సంస్థ అభివృద్ధి కుంటుపడుతుందని తెలిపారు. సమయానికి విద్యుత్ బిల్లులు చెల్లించడం వలన అపరాధ రుసుము పడదని సూచించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி